వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
1 min read– ఎకరాకు రెండు లక్షల నష్ట పరిహారం చెల్లించాలి
– దెబ్బతిన్న పంటల పరిశీలన
– రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిన గౌరు వెంకటరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని జలకనూరు గ్రామంలో భారీ వడగండ్ల వానతో దెబ్బతిన్న మిరప,మొక్కజొన్న,అరటి పంటలను నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు& నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి మండల నాయకులు మరియు గ్రామ సర్పంచ్ కురువ ఎల్లయ్యతో కలసి ఆయన పంటలను పరిశీలించారు.గ్రామంలో పంట నష్టం గురించి ఆయన పొలాల దగ్గరికి వెళ్లి స్వయంగా రైతులతో మాట్లాడారు.ఈసందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వర్షం వల్ల 200 ఎకరాల మిర్చి రైతులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షం వల్ల రైతులు లబోదిబో అంటున్నారని అదేవిధంగా 150 ఎకరాలు మొక్కజొన్న పంట దెబ్బతినిందని అంతేకాకుండా వివిధ పంటల్లో జరిగిన నష్టం గురించి ప్రతి రైతుకు ఎకరాకు రెండు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతులకు నష్టపరిహారం చెల్లించని పక్షంలో భారీ ఎత్తున రైతులతో కలిసి ఉద్యమం చేయబడతామని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,స్వామిరెడ్డి, మహేశ్వరరెడ్డి మొహిద్దిన్,చాంద్ భాష,సంపంగి రవీంద్రబాబు,సుభాన్ తదితరులు పాల్గొన్నారు.