గొర్రెల కాపరి లింగన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
1 min read
కర్నూలు న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం. ఎమ్మిగనూరు మంత్రాలయం రహదారి ప్రమాదంలో మృతి చెందిన గొర్రెల కాపరి కురువ లింగన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, గౌరవ అధ్యక్షులుకే. కిష్టన్న ప్రదానకార్యదర్శి ఎం.కే. రంగస్వామి,కోశాధికారి కె.సి. నాగన్న జిల్లా నాయకులు బి. సి. తిరుపాల్ డిమాండ్ చేశారు. గోర్రేల కాపరులు ఎదురుకొంటున్న సమస్యల పై చర్చించి ప్రభుత్వం తక్షణమే స్పందించి మృతి చెందిన కురువ లింగన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, అలాగే గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.