మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
1 min read
ఆదోని ఎమ్మెల్యే డా.పీవీ పార్థసారథి
కర్నూలు, న్యూస్ నేడు: శ్రీశైలం యాత్ర లో ఆక్సిడెంట్ జరిగి మృతి చెందిన కుటుంబాలకు మరియు గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి సొంత ఊరు ఆదోని వస్తున్న ప్రయాణంలో ప్రమాదవ శాత్తు ఆక్సిడెంట్ లో మృతి చెందిన వారి భౌతిక కాయాలు కు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ , అధికారుల తో కలసి పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగటం బాధాకరం అని తెలియజేశారు.బులోరో వాహనం లో ఈ విధంగా కింద, పైన ఓవర్ లోడ్ లో ఎవ్వరూ కూడా ప్రయాణించ వద్దని ప్రజలకు కోరారు. మృతి చెందిన కుటుంబాలకు యాక్సిడెంట్లో గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే పార్థసారధి హామీ ఇచ్చారు.