పేదరికనిర్ములానే ప్రభుత్వ లక్ష్యం…
1 min read
పీ4 సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తు 2047 నాటికి రాష్ర్టాన్ని సున్నా పేదరికం’ సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు. మంగళవారం ఎంపిడిఓ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పి-4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) భాగంగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ 2047 నాటికి సున్నా పేదరికం సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేదరికం లేని రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పి-4 అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అనేక అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించామని వెల్లడించారు. అందులో భాగంగా పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడంతో పాటు జీవన ప్రమాణాల్లో అట్టడుగు స్థాయిలో వున్న నియోజకవర్గంలో 5740 మంది మార్గదర్శి – బంగారు కుటుంబాలను గుర్తిచమన్నారు.ఆ కుటుంబాలను ఉపాధి కల్పించి అన్ని విధాలుగా ఆదుకుని నియోజకవర్గంలో 100% అర్హులందరికీ గృహాలు తప్పనిసరిగా ఉండే విధంగా అందుకనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు.విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగాముందుకెళ్తున్నామని తెలిపారు.ఈ సమావేశానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మూడు మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్‌లు, ఇతర అధికారులు హాజరయ్యారు.