PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

1 min read

– పట్టణంలో క్షయ వ్యాధి పై అవగాహన ర్యాలీ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం, మెరుగైన చికిత్స అందించడం ద్వారా 2025 నాటికి క్షయవ్యాధిని సమూలంగా రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డా.రాయుడు అన్నారు.శుక్రవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రి (సి.హెచ్‌.సి.) వైద్యుల ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు క్షయ రహిత సమాజం కొరకు అంకిత భావంతో పని చేస్తామని నినదిస్తూ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా విద్యాధికారి కృష్ణమూర్తి మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు.క్షయ రహిత సమాజం అందరి బాధ్యత అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.క్షయ వ్యాధిని సమూలంగా రూపు మాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడం ద్వారా 2025 నాటికి వ్యాధిని సమూలంగా రూపు మాపడమే లక్ష్యమన్నారు. అనంతరం స్థానిక ఏపీ ఎన్జీవోస్ భవనం నందు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డాక్టర్ రాబర్ట్ కాక్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రాయుడు మాట్లాడుతూ భారత దేశంలో క్షయ వ్యాధి వల్ల సుమారు 4000 మంది చనిపోతున్నారు కాబట్టి దీనినీ కట్టడి చేయాలంటే త్వరగా క్షయ వ్యాధిని గుర్తించి తగు వైద్యం చేయగలిగినట్లయితే 2025 నాటికి దీనిని నిర్మూలనా చేయవచ్చు అని చెప్పార. డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు జ్వరము ఆకలి మందగించడం ఉన్నట్లయితే టిబి లక్షణాలు గుర్తించవచ్చు అని చెప్పారు. డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ పౌష్టిక ఆహారము తీసుకోవాలి, రోగ నిరోధక శక్తి నీ పెంచుకోవాలని, టీబీ బారిన పడకుండా ఉండొచ్చు అన్నారు. టీబి సూపర్ వైజర్ చక్రపాణి మాట్లాడుతూ ఏఎన్ఎం లు ఆశలు ముఖ్య పాత్ర పోషించాలని, ఫీల్డ్ లో క్షయ వ్యాధి గ్రహస్తులను గుర్తించి త్వరగా గళ్ళ పరీక్ష చేసినట్లయితే క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించవచ్చును అన్నారు. సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఏపీ ఎన్జీవో కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ రాబర్ట్ కాక్ జర్మనీ దేశస్థుడు 1882లో టిబి బ్యాసిలై నీ కనుగొనడం జరిగిందన్నారు. 1843 లో డిసెంబర్ 11 జన్మించారు, 1910 మే 27 మరణించారు. జ్ఞాపకార్థం 24 మార్చ్ తేదీన ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్రస్తుతం ల్యాబ్లో అత్యధిక పరికరాలతో క్షయ వ్యాధిని నిర్ధారణ చేస్తారని తెలిపారు. క్షయ వ్యాధిని గుర్తించి త్వరగా మందులు వాడితే ఆరు మాసంలో క్షయ వ్యాధి నయమవుతుందని చెప్పారు. ఒకప్పుడు క్షయ వ్యాధి అంటే భయపడేవాళ్ళని మరణం తప్పదని .. అయితే ఇప్పుడు ఆరు మాసంలో మందులు వాడినట్లయితే పూర్తిగా నయమవుతుందని ఏమి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author