PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ సృష్టిలో అతి పెద్ద రహస్యం ప్రేమ

1 min read

ఫాదర్ పీటర్ ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఈ సృష్టిలో అతి పెద్ద రహస్యం ప్రేమ అని ఈ సమస్త విశ్వాన్ని ఆవరించి ఉన్న ప్రేమను గమనించడానికి మీకు నిశితమైన దృష్టి అవసర మనీ పునీత పేతురు పౌలు దేవాలయం ఫాదర్ పీటర్ ప్రభాకర్ అన్నారు, క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ప్రార్థనలలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ఆయన క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడారు, ఈ విశ్వంలో అతి పెద్ద రహస్యం ప్రేమ అని, ఆ ప్రేమను ప్రభువైన ఏసుక్రీస్తు లో మాత్రమే చూడగలరని, ఆయనను విశ్వసించు వారికి ఆ ప్రేమ దొరుకుతుందని ఆయన తెలిపారు, మానవాళికి సుపరిచితమైన ఎంత బలమైన అనంతమైన శక్తితో పాటు సున్నితమైన ప్రేమను కూడా సమస్త మానవాళికి పంచడం జరిగిందన్నారు, కాబట్టి సమస్త జనులను ప్రేమించండి, ప్రేమను పంచండి దీంతో ఒకరికి ఒకరు స్నేహ బంధంతో ఉంటారని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, ఇదే యేసు మానవాళికి పంచిన ప్రేమ అని, అందరూ సోదర సోదరి భావనతో కలిగినప్పుడే విశ్వశాంతి ఉంటుందని ఆయన క్రైస్తవ విశ్వాసులకు తెలిపారు, ఈ కార్యక్రమంలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.

About Author