ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
1 min readస్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదిదారులు..
జిల్లా ఎస్పీ కి పిర్యాదులు, వర కట్నం వేదింపులు, సరిహద్దుల విషయములో గొడవలు, సివిల్ వివాదలపై పిర్యాదులు..
ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : దెందులూరు మండలం నుండి వృద్ధ దంపతులు ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి వారి యొక్క కుమారుడికి ఆస్తిని రాయించుకుని వారి యొక్క చూడట్లేదని చెప్పి ఇచ్చిన రిపోర్టుపై చర్యలు తీసుకోవాల్సిందిగా కొరినారు.కోయిలగూడెం మండలం పరింపుడి గ్రామ నుండి ఒక వృద్ధ మహిళ ఎస్పీని స్పందన కార్యక్రమంలో కలిసి తన వద్ద నుండి తన కుటుంబుక్కులు ఆస్తిని రాయించుకుని ఆమె పట్ల నిరాదరణ చూపిస్తున్నారు అన్న విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరరు.పెదపాడు మండలం కొత్త ముప్పర నుండి ఒక మహిళ ఎస్పీ ని స్పందన కార్యక్రమంలో కలిసి తన కుమార్తెపై అత్యాచారానికి పూనుకున్న విషయంపై చర్యలు తీసుకోవలసినదిగా కోరరు. ఏలూరు పట్టణం నుండి ఒక మహిళ తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రెండు లక్షల 50 వేల రూపాయలు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసిన విషయంపై చర్యలు తీసుకోవలసినదిగా కోరినది. ఏలూరు మండలం నుండి ఒక మహిళ ఎస్పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసి తనకి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగినట్లు అది ఇద్దరికీ రెండో వివాహం అయినట్లు తన భర్త చెడు వ్యసనాలకు అలవాటు పడి ఫిర్యాదిని మానసికంగా శారీరకంగా హింసిస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవలసినదిగా కోరరు.స్పందన కార్యక్రమానికి వచ్చిన సుమారు 50 ఫిర్యాదులన్నింటి పై సత్వరమే చట్ట ప్రకారం ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాటలాడి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాలపై ఏలూరు సత్యసాయి సమితి వారు జిల్లా చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఈ స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదిదారులకు భోజన వసతి సదుపాయాలను కలగా చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలని అపరిచితులు వ్యక్తుల వద్ద నుండి వచ్చే లింకులను గాని ఫోన్ కాల్స్ గాని మెసేజ్లకు గాని స్పందించరాదని అలా స్పందించి మీ యొక్క ఓటీపీని తెలియజేస్తే సైబర్ నేరగాళ్లు ప్రజల యొక్క విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని బ్యాంకులను లో ఉన్న డబ్బును దోచుకుంటారని ప్రతి ఒక్కరు ఎదుటివారి యొక్క సమాచారం తెలుసుకున్న తర్వాత స్పందించాలని తెలియ చేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎం. జే.వి. భాస్కర రావు పాల్గొన్నారు.