PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

థియేట‌ర్లో పేలిన తుపాకీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేజీఎఫ్ సినిమా థియేట‌ర్లో తుపాకీ పేలింది. సినిమా చూడ్డానికి వచ్చిన ఓ ఆగంతకుడు సినిమాలోని ఒక సన్నివేశానికి ఆవేశంగా సీట్లోంచి పైకి లేచి.. సడెన్ గా గాల్లోకి తుపాకీ పేల్చాడు. ఈ ఘ‌ట‌న కర్నాటక శిగ్గావిలోని రాజశ్రీ థియేటర్ లో జ‌రిగింది. ఆగంతకుడు జరిపిన మూడు రౌండ్ల కాల్పుల్లో.. ఒక గుండు వసంత్ కుమార్ అనే ఒక ప్రేక్షకుడి కాల్లోకి దిగడంతో అతడు అరిచి గోల పెట్టాడు. గాయపడిన ప్రేక్షకుడ్ని థియేటర్ యాజమాన్యం దగ్గరలోని ఒక ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపింది ఎవరన్నది తెలియలేదు. ప్రేక్షకుల్లో ఎవరైనా అత్యుత్సాహంతో కాల్పులు జరిపారా? లేక వసంత్ కుమార్‌కు శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

                                           

About Author