ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
1 min read
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : రాయచోటి మండలం యండపల్లి గ్రామం పెద్ద కాలువ పల్లికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న ఆంజనేయులును కుటుంబ సభ్యులు చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె కలరు. ఈ మేరకు పోలీసులు ఆసుపత్రికి చేరుకుని జరిగిన సంఘటనపై విచారిస్తున్నారు.