PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంట్రాక్ట్ కార్మికుల కష్టాలు.. కడతేర్చేదెవరు?

1 min read

సీఆర్పీ హక్కుల సాధన సమితి కన్వీనర్ ఆదిమూలం శంకర్

పల్లెవెలుగు: చెన్నూరు గత 11 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నన కాంట్రాక్ట్ కార్మికుల కష్టాలు కడతేర్చేదెవరు ?అని సీఆర్పీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ ఆదిమూలం  శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, గురువారం ఆయన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికుల ఇబ్బందులు అనేకం ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు, ఇప్పటికే జిల్లాలో  సమగ్ర శిక్ష లో సీఆర్ పలుకు పనిచేస్తున్న కొంతమంది వివిధ రకాలుగా మరణించడం జరిగిందని ఆయన తెలియజేశారు, వాటిలో గత నెల 24వ తేదీన అన్నమయ్య అలాగే వైయస్సార్ ఉమ్మడి కడప జిల్లాలలో సమగ్ర శిక్షలో సీఆర్పీలుగా పనిచేస్తున్న నాగేంద్రప్రసాద్ , లక్కిరెడ్డిపల్లి మండలం లో కారు యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది అన్నారు, అదే విధంగా  నరసింహారావు , బద్వేల్ మండలం కు సంబంధించిన సి ఆర్ పి హార్ట్ ఎటాక్  వలన మరణించారని తెలియజేశారు, ఇలా ఆ రెండు కుటుంబాల కు సంబంధించిన  పెద్దదిక్కులను కోల్పోవడంతో ఆ కుటుంబాలు, ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది అన్నారు, ఇలాంటి తరుణంలో  కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలలో భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు, మా జీవితాల పట్ల ప్రభుత్వం చర్యలు చెట్టకపోతే, మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోక తప్పదని ఆయన తమ నిస్మాసహాయ స్థితి గురించి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది, కాంట్రాక్ట్ కార్మికులు నిరంతరం పని ఒత్తిడి చాలీచాలి వేతనాలతో పనిచేస్తున్నారని వారందరికీ ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు,  ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ,రాష్ట్రంలో కాంట్రాక్ట్  కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారికి వారి కుటుంబాలకు భద్రతా , భరోసాను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. గత 11 సంవత్ససరాలుగా  సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ద్వారా పాఠశాల సముదాయ పరిధిలో పనిచేస్తూ మరణించిన సి ఆర్ పి ల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని రకాల వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ వారి జీవితాలలో వెలుగులు నింపుతున్నాడని అలాగే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులైన సిఆర్పి ల కుటుంబాలకు ఒక భద్రత కల్పించేే దిశగా చర్యలు తీసుకోవాలని , తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఆర్పిలు రవిచంద్ర , గురయ్య పాల్గొన్నారు.

About Author