వెయ్యి కోట్ల ఇల్లు.. సొంతం చేసుకున్న డీమార్ట్ అధినేత
1 min readముంబయి: దేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు రాధాకిషన్ దమాని. రాధాకిషన్ దమాని రిటైల్ సూపర్ మార్కెట్ చైన్ అయిన డీమార్ట్ అధినేత. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతం మలబార్ హిల్స్ .. ఈ ప్రాంతంలో 1001 కోట్లకు రాధాకిషన్ దమాని, తన సోదరుడు గోపికిషన్ దమానితో కలసి కొన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద ప్రాపర్టీ డీల్స్ లో ఇదే పెద్దది. ఇందుకోసం 30 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించారు. మార్చి 31న ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు .. ఇలా భూములు కొనుగోలు చేయడం.. మార్కెట్ పుంజుకున్నాక వాటిని అమ్మడం రాధాకిషన్ దమానికి వెన్నతో పెట్టిన విద్య. ఇటీవలే ముంబయి థానేలో 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దేశంలోని అత్యంత ధనవంతుల్లో రాధాకిషన్ దమాని కూడ ఒకరు.