NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హృద‌యం ముక్కలైంది..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌రోన మ‌హ‌మ్మారితో పోరులో భార‌త్ పరిస్థితి చూసి త‌న హృద‌యం ముక్కలైంద‌ని మైక్రోసాఫ్ట్ అధినేత స‌త్య నాదెళ్ల అన్నారు. ఆక్సిజ‌న్ అంద‌క కరోన రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన‌టం చాలా బాధాక‌ర‌మ‌ని అన్నారు. భార‌త్ కు స‌హాయం చేసేందుకు అమెరికా ముందుకు రావ‌డం శుభ ప‌రిణామం అని అన్నారు. ఆక్సిజ‌న్ కొనుగోలులో త‌మ స‌హాయం కూడ ఉంటుంద‌ని అన్నారు. మైక్రోసాఫ్ట్ త‌ర‌పున భార‌త్ కు స‌హాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స‌త్యా నాదెళ్ల తెలిపారు. క‌రోన కేసుల‌తో పాటు మ‌ర‌ణాలు కూడ పెర‌గ‌డంతో ప్రపంచ దేశాల మ‌ద్దతు భార‌త్ కు ల‌భిస్తోంది. ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా వేధిస్తున్న వేళ వివిధ దేశాలు త‌మ స‌హాయాన్ని, మ‌ద్దతుని తెలియ‌జేశాయి.

About Author