శ్రీవారిని దర్శించుకున్న హీరో రాజశేఖర్ దంపతులు
1 min read
పల్లెవెలుగువెబ్ : సినీ హీరో రాజశేఖర్, జీవిత దంపతులు, తమ కుమార్తెలు హీరోయిన్ శివాని, శివాత్మిక ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి కాలినడకన తిరుమలకు చేరుకున్న వీరు ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. కాగా, దర్శనానంతరం ఆలయం ముందు జీవిత మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాజశేఖర్‌కు కొవిడ్ సోకి చాలా ఇబ్బంది పడ్డారని, ఆ సమయంలో తిరిగి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే కాలినడకన తిరుమలకు వస్తామని మొక్కుకున్నట్టు వివరించారు.