ఇంటికొకరు సైన్యంలో ఉండాల్సిందే !
1 min readపల్లెవెలుగు వెబ్: టిబెట్ లో ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు సైన్యంలో ఉండాలన్న నిబంధనను చైనా అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సైన్యాన్ని సమీకరించి.. భారత సరిహద్దుల వెంబడి వాస్తవాధీన రేఖ మీదుగా మొహరించాలన్నది చైనా ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. భారత సైన్యంలో టిబెటన్ల ప్రదర్శన చూసిన తర్వాత .. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో చైనా ఈ నిర్ణయానికి వచ్చినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భారత్, చైనాలు 12వ కోర్ కమాండ్ స్థాయి చర్చల్ని శనివారం ఉదయం ప్రారంభించనున్నాయి.