బాధితులకు హ్యూమన్ రైట్స్ అండగా ఉంటుంది
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: నంద్యాల జిల్లా ఇస్లాంపేట ప్రాంతంలో పేద ప్రజల ఇల్లను కూల్చకుండా ప్రభుత్వం చొరవ చూపాలని నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పల్లబాల మద్దిలేటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ వత్తిళ్లకు అధికారులు తలొగ్గదని, పేద ప్రజల పక్షాన నిలబడాలని ఆయన అన్నారు. నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చైర్మన్ పలబాల పల్ల బాల మద్దిలేటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ లోని బొగ్గులైన్ ఇస్లాంపేట అనే ప్రాంతంలో గత 100 సంవత్సరాలుగా పేదప్రజలు ప్రభుత్వ స్థలాలతో ఇల్లు నిర్మించుకొని చుట్టు పక్కలో ఉన్న కర్మగారాలలో పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. ఈ నిరుపేద ప్రజలు తమ ఇల్లను తమకి రిజిస్టర్ చేయమని తాము మరి ఎక్కడ బ్రతకలేమని అనేకమారులు అధికారులకు దరకాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఇప్పుడన్న ఇళ్లను తమకే రిజిస్టర్ చేయమని ఏపీ రెవెన్యు ప్రిన్సిపల్ సెక్రటరీ కి అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ నంద్యాల ఆర్.డి.ఓ, ఎమార్వో, నంద్యాల మునిసిపల్ కమిషనర్ కి రిజిష్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్పారు. అధికారుల మాట వినకపోతే జేసీబీ లతో ఇల్లు పడగొడతామని బెదిరించారని ఆరోపించారు.ఈ విషయమై బాధితులు తమను సంప్రదించారని, గత సంవత్సరం తాము బాధితులతో కలిసి మే 31న నంద్యాల జిల్లా కలెక్టర్ కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి జీవో ఇచ్చామని తెలిపారు. తాము ఈ విషయమై హైకోర్టును సంప్రదించామని దయచేసి అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొద్దని హితవు పలికారు.సమావేశంలో కృష్ణాజిల్లా సెక్రటరీ కే గంగాధర్, సభ్యులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.