NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టు వీడని విద్యుత్ ఉద్యోగుల నిరాహార దీక్ష..

1 min read

– దీక్షా శిబిరానికి భారీ సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు హాజరు..

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు  : తమ సమస్యలు పరిష్కారానికి చేపట్టిన  విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష గురువారం నాటికి రెండో రోజుకు చేరింది. ఏలూరు విద్యుత్ భవనం వద్ద ఉద్యోగుల నిరాహార దీక్షకు భారీ సంఖ్యలో 31 సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐకాసా జిల్లా చైర్మన్ ఎం రమేష్ ,  ఐకాస ఐదు జిల్లాల డిస్కం కన్వీనర్ భూక్య నాగేశ్వరరావు, ఐదు జిల్లాల డిస్కo కో కన్వీనర్ తురగా  రామకృష్ణ , మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలన్నారు. పొరుగు సేవల ఒప్పంద కార్మికుల ను క్రమబద్ధీకరించాలన్నారు. సమాన పనికి సమానమేతరం ఇవ్వాలని ఉద్యోగుల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author