ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు… పి. రామచంద్రయ్య
1 min read
చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తున్న నాయకులు
పత్తికొండ, న్యూస్ నేడు: ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య అన్నారు. బుధవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో కామ్రేడ్ సీ.ఆర్. చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాతికేళ్లకు పైగా పనిచేసిన చండ్ర రాజేశ్వరరావు జీవితం ఆదర్శనీయమన్నారు. సమాజంలో దోపిడీ లేని సమ సమాజ నిర్మాణం స్థాపన కోసం దళితులు, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకై చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలో అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. కామ్రేడ్ సీ ఆర్ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది తమ వీలునామా అని గుర్తు చేశారు. సి. ఆర్ అస్తమించే చివరి క్షణాల్లో నాకు ఆస్తిపాస్తులు లేవు నేను ఎవరికీ ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదని, పుస్తకాలు పార్టీకి, దుస్తులు ఆప్తులకు అని తమ వీలునామాలో పేర్కొన్నారని, పార్టీ శ్రేణులు ఆయన ఆశయ సాధనకు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, సిపిఐ సీనియర్ నాయకులు భీమలింగప్ప పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, పార్టీ ప్రజా సంఘాల నాయకులు గురుదాస్, తిమ్మయ్య, ఉమాపతి, సురేంద్ర కుమార్, , నాగిరెడ్డి, నాగరాజు, విజయ్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.