దేశానికే ఆదర్శం జగనన్న ఆరోగ్య సురక్ష.
1 min readనాణ్యమైన వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: దేశానికే ఆదర్శంగా జగనన్న ఆరోగ్య సురక్ష నిలుస్తోందని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. మంగళవారం జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్థర్ పాల్గొన్నారు.శిబిరం నందు ఓపి నమోదు కేంద్రం,రోగులను వైద్యులు పరీక్షించు కేంద్రాలు, రక్త పరీక్షలు నిర్వహించు కేంద్రం, మందులు పంపిణీ కేంద్రాలును ఎమ్మెల్యే ఆర్థర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి సారిగా, రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి, అవసరమైన వారందరికీ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమన్నారు రాష్ట్రంలో సుమారు కోటి, 63 లక్షల కుటుంబాల్లోని దాదాపు ఐదు కోట్ల మందికి చెందిన ఆరోగ్య డేటాను సేకరించడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఏడు రకాల ఆరోగ్య, వైద్య పరీక్షలను నిర్వహించి, మందులను ఉచితంగా అందజేసి, ఇంకా మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఇతర ఆసుపత్రలకు రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష, ఆశయాలను నెరవేర్చేందుకు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చిన రోగులను వాలంటీర్లు ,వైద్య సిబ్బంది చేయిపట్టుకును,దగ్గరుండి అవసరమైన రక్త పరీక్షలను చేయించి,వైద్యం అందేలా చేసి రోగులు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. తూతూ మంత్రంగా శిబిరాలు నిర్వహిస్తే సహించమని ఆయన హెచ్చరించారు.ప్రతి రోగికి నిదానంగా వైద్య పరీక్షలు, వైద్యం అందేలా చూడాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలలో కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితర ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. రోగులకు భోజనవసతి సౌకర్యాలును స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంపియూపీ పాఠశాల ను తనిఖీ చేసి విద్యార్థుల తో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సువర్ణమ్మ. మండల తహసిల్దార్ పుల్లయ్య యాదవ్ , ఇంచార్జ్ ఎంపీడీవో నూర్జహాన్ , వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి , సురేందర్ రెడ్డి , తంగెడంచ ఈదుల కరుణాకర్ రెడ్డి , జంగాల పెద్దన్న, తర్తూరు హనుమంత రెడ్డి, తాటిపాడు కృష్ణారెడ్డి, పోతులపాడు శివానందరెడ్డి, పారుమంచాల దేవ సహాయం, నందికొట్కూరు ఉండవల్లి ధర్మారెడ్డి, తమ్మడపల్లి విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి పెరుమాల్ల జాన్ , వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఇతర వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.