NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగరంగ వైభవంగా శ్రీ గణపతి హనుమ సమేత రామలక్ష్మణ విగ్రహ ప్రతిష్ట

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని శివాలపల్లె హరిజనవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ గణపతి హనుమ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని శనివారం అంగరంగ వైభవంగా ఆలయ కార్య నిర్వాహకులు, గ్రామస్తులు నిర్వహించారు ,ఉదయం 7 గంటలకు గర్త పూజ, యంత్ర ప్రతిష్ట, తదుపరి 8 గంటల పది నిమిషాల నుండి శిఖర కలశ ప్రతిష్ట, శ్రీ సీతారామ లక్ష్మణ, హనుమ విగ్రహ ప్రతిష్ట , 10 గంటలకు ప్రాణ ప్రతిష్ట సర్వదర్శనం పూర్ణాహుతి, 10 గంటలు 11 గంటల నుండి శ్రీ సీతారామ కళ్యాణము వేద పండితులచే నిర్వహించడం జరిగింది, అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,  ప్రత్యేక పూజలలో కాశీభట్ల సత్య సాయినాధ శర్మవైఎస్ఆర్ సీపీ నాయకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ శ్రీ సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికి ఆయనను ఘనంగా సత్కరించారు,అనంతరం సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు.

About Author