అక్రమ అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే
1 min readపల్లెవెలుగు, వెబ్ పత్తికొండ : రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ.కే.ఈ.శ్యామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పత్తికొండ పట్టణం నందు తెలుగుదేశం పార్టీఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్ట్ వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే అని, జగన్ ముఖ్యమంత్రి లా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అయ్యన్నకుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందని, అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలు ఆయనపై 10కిపైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.చింతకాయల విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని, పోలీసులు దొంగల్లా ఇళ్ల మీద పడి అరెస్టులు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బత్తిన వెంకట్రాముడు, మనోహర్ చౌదరి,అశోక్ కుమార్, పాలేగార్ రామానాయుడు ,ఎర్రగుడి వెంకటస్వామి,సోమ్లా నాయక్, చంద్రన్న, బాలన్న,ఈశ్వరప్ప, బత్తిన లోకనాథ్, కాకర్ల లక్ష్మీనారాయణ, గుడిసె నరసింహులు, కడవల సుధాకర్ ,పెద్దహల్తి తిప్పన్న, దాదావలి, చక్రాల రాజు, ముని నాయుడు, భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి ,సింగం శీను ,మీరా హుస్సేన్,ఉరుకుందు,సోమశేఖర్ గౌడ్, శ్రీనివాసులు గౌడ్, చక్రి నాయక్, మోహన్, పెద్ద రంగన్న ,అశోక్, మునిస్వామి, రజాక్,సాయి,రాజశేఖర్,వీరాంజనేయులు, సుధాకర్, తదిర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.