గరుడ, ఆళ్వారాచార్యుల దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవం
1 min read– గోకులాన్ని సందర్శించిన కర్నూలు ఎం.పి.సంజీవకుమార్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని మామిదాలపాడు సమీపంలో వెలసిన శ్రీగోదా గోకులం నందు గత పది రోజులుగా జరుగుతున్న యాగాది క్రతువులు బుధవారం శ్రీ రంగనాయకి గోదా సమేత శ్రీ రంగనాథ పెరుమాళ్ మరియు సుదర్శన, గరుడ, ఆళ్వారాచార్యుల దేవతా మూర్తుల ప్రతిష్టాపన మహోత్సవంతో పాటు యాగశాల ద్వారతోరణధ్వజ కుమ్భారాధన, ప్రాతరారాధన, అర్చన, సేవాకాలం, ప్రతిష్టాంగ శాంతి హోమములు, మహా పూర్ణాహుతి, మహాకుమ్భ సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టా, దృష్టి కుమ్భం, ప్రధమ దర్శనం, అర్చన, నివేదన, శాంతి కల్యాణం, పెరియశాత్తుమొర,శ్రీ జీయర్ స్వామి వారికి ఆలయ మర్యాద, ఆచార్యాదిఋత్విక్ సమ్మానములు, యజమాన ఆశీర్వచనము, తీర్థ ప్రసాద గోష్టి, అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది.పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆగమ సార్వభౌమ శ్రీ మద్వాధూల సముద్రాల రమాకాన్తాచార్య స్వామి వారి అధ్వర్యంలో ఈ యజ్ఞం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి. సంజీవకుమార్ ను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గోదాగోకులం వ్యవస్థాపక చైర్మన్ మారం నాగరాజ గుప్త మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, వేదపండితులు శ్రీమన్నారాయణా చార్యులు, మాధవాచార్యులు, భగవాన్ ఆచార్యులు, రమేశ్ ఆచార్యులు, రంగనాథాచార్యులు, కాండూరి శ్రీనాథ్,వంశీకృష్ణమాచార్యులతో పాటు అనేక మంది ఋత్విక్కులు పాల్గొన్నారు. గోదా గోకులంలో జరిగిన ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రయాగ నుండి ప్రపర్ణ రాఘవ జియర్ స్వామీజీ, భాగ్యనగర్ నుండి వ్రతధర శ్రీనివాస రామానుజ జీయర్ స్వామీజీ, గంగాపురం పీఠం నుండి పరమాత్మానంద గిరి స్వామీజీ,కర్నాటక రాష్ట్రం మేల్కోట, నుండి శఠగోప రామానుజ జీయర్ స్వామీజీతో పాటు వివిధ ప్రాంతాల పీఠాధిపతులతో పాటు విశ్వహిందూ పరిషత్ జాతీయ సహకార్యర్శి వై.రాఘవులు, జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, లలితా పీఠం మేడా సుబ్రహ్మణ్యం స్వామితో పాటు వివిధ రంగాల ధార్మిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.