ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీని విధుల నుండి తొలగించాలి
1 min read– బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి, యువజన సంఘం డిమాండ్.
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: స్థానిక నంద్యాల పట్టణంలో విద్యార్థుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు మాట్లాడుతూ ఐదు నెలలు గడుస్తున్నా కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గారు ఇంతవరకు మెదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ అడ్మిషన్లు విడుదలలేకపోవడం చాలా బాధాకరమని, పదవ తరగతి పాసై ఇంటర్మీడియట్ లో చేరిన విద్యార్థులు నచ్చిన కళాశాలలలో చేరే అవకాశం లేక, విద్యకు దూరమయ్యే అవకాశం ఎక్కువ ఉందని,బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంతవరకు అడ్మిషన్లు ప్రారంభించ లేదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, ఇంటర్మీడియట్ 2022-2023 మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆన్లైన్ వెంటనే విడుదల చేసి, మెదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభించాలనీ ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయక్,రాజు,రంగ తదితరులు పాల్గొన్నారు.