భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి
1 min readఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌కు వినతిపత్రం అందజేసిన నాయకులు
పల్లెవెలుగు వెబ్: నేటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలొ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు ఖాజా పాషా, నగర ఉపాధ్యక్షులు, అబ్దుల్ దేశాయ్, ఉబెదుర్ రెహమాన్, నగర కార్యదర్శి ముహమ్మద్ షరీఫ్ లు కలసి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి వినతి పత్రం ఇవ్వడం జిగిందని వారు తెలియజేశారు. జగనన్న అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇసుక ను రద్దు చేసి, కొత్త పాలసీ తీసుకొస్తామని ఇప్పటివరకు, ఇసుక ను అందుబాటులోకి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అనేక సంవత్సరాలుగా ధర్నాలు ఆందోళనలు పోరాటాలు చేసి సాధించుకున్నామని, సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నప్పటికీ జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఆపేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఓ నెంబర్ 17 తీసుకొనివచ్చి రాత్రికి రాత్రే ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు మళ్లించుకోవడం జరిగిందని, మెమో నెంబర్ 12, 14 తీసుకువచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసేది లేదని, మొండిగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.