PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయం

1 min read

– ప్రజలవద్దకే పాలనను అందిస్తున్న సీఎం జగన్
– సంక్షేమాభివృద్ధిలో సీఎం జగన్ సరికొత్త ఆడుగులు
– మల్యాల లో గడప గడప కు మన ప్రభుత్వం కు విశేష స్పందన
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వమని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. బుధవారం నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంఎల్ఏ ఆర్థర్ పాల్గొన్నారు. గడప గడపకు ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజా సమస్యలుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ అభివృద్ది, సంక్షేమం రెండు కళ్ళుగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారన్నారు. విప్లవాత్మక మార్పులుతో, వ్యవస్థలలో మార్పులు తెచ్చి ప్రజల వద్దకే పాలనను తెచ్చారన్నారు. సీఎం జగన్ పాలన ఆదర్శంగా, పారదర్శకంగా సాగుతోందన్నారు.సంక్షేమాభివృద్ధిలో సీఎం జగన్ సరికొత్త అడుగులు వేస్తున్నారన్నారు.సీఎం జగన్ పాలనను ప్రజలందరూ మెచ్చుకుంటున్నారన్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయం..
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. సమస్యలుపై ఆయన ప్రజలుతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అవ్వా బాగున్నారా…అక్కా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఆప్యాయంగా పలకరించారు .ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు తమను ఆదుకుంటున్నాయంటూ గ్రామస్తులు ఎమ్మెల్యే ఎదుట హర్షం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వంలో నాయకుల సిపారసుతోనూ, జన్మభూమి కమిటీలతో పథకాలు అందేవని, ఇప్పుడు ఎవ్వరి సిపారసు లేకుండానే, అర్హత ఉంటే ఇళ్ల దగ్గరకే పథకాలును సీఎం జగన్ గారు పంపిస్తున్నారంటూ వారు హర్షం వ్యక్తం చేశారు.ప్రతి ఇంటికీ రెండూ,మూడూ పథకాలు అందాయని, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ,కాపునేస్తం, నేతన్న నేస్తం తదితర పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయంటూ అక్క చెల్లెమ్మలు ఎమ్మెల్యే ఆర్థర్ ఎదుట సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓ శోభారాణి, మండల వ్యవసాయ అధికారి శ్రావణి , విద్యాధికారి ఫైజున్నిసా బేగం , పంచాయతీ రాజ్ ఏఈ ప్రతాప్ రెడ్డి, ఆర్డబ్ల్యూ ఏఈ వేణు మాధురి, ఐసీడీస్ సూపర్ వైజర్ ఆశ్వీరోదమ్మ , విద్యుత్ శాఖ ఏఈ రాములు నాయక్ ,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య, బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డి , ఉర్డు అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ షూకురు, వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author