NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ కుటుంబం నైతిక బాధ్య‌త వ‌హించాలి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు పై సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వివేకా హ‌త్య కేసులో వాస్త‌వాలు బ‌య‌టికి వ‌చ్చాయ‌ని పేర్కొ్న్నారు. స్వయానా సీఎం జగన్ కుటుంబం నుంచి ఇలాంటి హత్య సంస్కృతి వచ్చిందా? అని నివ్వెరబోయారు. వివేకా హత్యపై జగన్ ఫ్యామిలీ నైతిక బాధ్యత వహించాలన్నారు.

బిగ్ బాస్ కు వ్య‌తిరేకంగా..

                  ఇదే సంద‌ర్భంలో సీపీఐ నారాయ‌ణ బిగ్ బాస్ రియాల్టీ షో పై స్పందించారు. బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా డిజిటల్ ప్రచారం చేస్తున్నామని నారాయణ వెల్లడించారు. బిగ్‌బాస్ హౌస్ బ్రోతల్ హౌస్‌గా మారిందని మరోసారి వ్యాఖ్యానించారు. లైసెన్స్ పొందిన వ్యభిచార గృహం నిర్వహించడానికి షో నిర్వహిస్తున్నారంటూ సీపీఐ నారాయణ విమర్శించారు.
                                        

About Author