విశ్వం లోని రహస్యాలను శోధించడమే సైన్స్ పని..
1 min read
రాష్ట్ర అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్…
కర్నూలు , న్యూస్ నేడు: సైన్స్ అన్నది ప్రయోగానికి లోబడే పనిచేస్తుంది అని, ప్రయోగం అన్నది నీవున్న చోట, ప్రస్తుత కాలం లో జరుగుతుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. సురేష్ కుమార్ అన్నారు.. శుక్రవారం స్థానిక బిర్లా కాంపౌండ్ లోని బ్రహ్మా రెడ్డి కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో ఆయన మాట్లాడుతూ వేదిక ప్రజల సమస్యలైన అక్షరాస్యత,సారా ఉద్యమం మరియు పొదుపు,మహిళా సాధికారత అంశాలపై పని చేసిందని రాబోయే కాలంలో యువత & అలవాట్లు, విద్య,ఆరోగ్యం, సైబర్ నేరాలు వంటి రంగాల్లో పనిచేస్తుంది తెలిపారు.. రాష్ట్ర మహాసభలు జూలై నెలలో కడప లేదా ఒంగోల్ లో నిర్వహించాలని రాష్ట కమిటీ నిర్ణయించందని తెలిపారు.విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ కోశాధికారి సనావుల వేదిక వ్యవస్థాపక డాక్టర్ బ్రహ్మారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, శేషాద్రి రెడ్డి, రమణయ్య,రమేష్ రాజు, మీన, బాషా,సుజాత, కొండమ్మ, యోహావ్, శ్రీరాములు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.