న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికే జవాబుదారీ !
1 min readపల్లెవెలుగువెబ్ : న్యాయ వ్యవస్థ కేవలం రాజ్యాంగానికే జవాబుదారీ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. ‘‘ఆయా సంస్థలకు రాజ్యాంగం అప్పగించిన పాత్రను, బాధ్యతలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన ఉంది. ప్రతీ ప్రభుత్వ చర్యను న్యాయవ్యవస్థ సమర్థించాలని అధికారంలో ఉన్న పార్టీ భావిస్తుంది. ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ ఉండాలని ఆశిస్తాయి. ప్రజల్లో రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య సంస్థల కార్యకలాపాలపై అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి తప్పుడు ఆలోచనలు వర్ధిల్లుతాయి. స్వతంత్ర సంస్థను దిగజార్చడమే లక్ష్యంగా ఇటువంటి ప్రచారం తీవ్రంగా వ్యాప్తి జరుగుతోంది. నేను స్పష్టం చేస్తున్నాను..న్యాయ వ్యవస్థ రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీ’’ అని వ్యాఖ్యానించారు.