వైస్సార్సీపీ పార్టీ న్యాయ విభాగం అత్యంత శక్తి వంతమైనది
1 min read– ఎస్ వి దంపతులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైఎస్ఆర్సిపి న్యాయవిభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ రామ సుబ్బారెడ్డి సీనియర్ శాసనసభ్యులు ఆటసాని రాంభూపాల్ రెడ్డి నగరం మేయర్ శ్రీ బివై రామయ్య ఎంపీ శ్రీ సంజీవ్ కుమార్ మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావం నుంచి న్యాయ విభాగం చాలా క్రియ శీలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. వైఎస్ఆర్సిపి చేపట్టే కార్యక్రమం లు ప్రజల కు న్యాయ వాదు లు తెలియచేయాలి అని పిలుపు నిచ్చారు కార్యక్రమం లో జోనల్ ఇంచార్జ్ ఎం ప్రభాకర్ తో పాటు న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.