అద్భుతంగా జరిగిన..కళ్యాణ మహోత్సవం
1 min read
మిడుతూరు మండలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో బుధవారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గోవింద మాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి కల్యాణం మిడుతూరు బ్రహ్మంగారి మఠం వద్ద ఘనంగా నిర్వహించారు.ప్రతి ఏటా మహా శివరాత్రి రోజున బ్రహ్మంగారి కళ్యాణం జరుగుతాయి.వైశాక శుద్ధ దశమి బ్రహ్మం గారి పుట్టినరోజు వేడుకలను మహా శివరాత్రి రోజున నిర్వహిస్తూ ఉంటారు.విశ్వశాంతి,లోక కల్యాణార్దం ఆలయ కమిటీ కాతా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవ కార్యక్రమానికి తువ్వా శ్రీదేవి,రామ నాగేశ్వర్ రెడ్డి దంపతులు,కుమార్తె గాయత్రి హాజరై సుబ్రహ్మణ్య శర్మ తో ప్రత్యేక పూజలు మరియు కళ్యాణం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి నేటికి భక్తులు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు.తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలను నిజమయ్యాయి.కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి అని అంతే కాకుండా రాయలసీమలో బనగానపల్లె బ్రహ్మంగారి మఠం తదితర ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆయన జీవ సమాధి అయిన ఆనవాళ్లు ఉన్నాయని కలియుగంలో పాపాలు ఎక్కువైనప్పుడు మళ్లీ వీర భోగ వసంత రాయలుగా జన్మిస్తానని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉండడం మరో విశేషం.కులమతాలకు అతీతంగా పలువురు భక్తులు హాజరై స్వామి వారికి పూజలు నిర్వహించారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కమిటీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి,ఆర్యవైశ్య ప్రముకులు కృష్ణమోహన్ శెట్టి, జమాల్ బాష,చల్లా నాగరాజు, మధు గోపాల్,టి శ్రీనివాసులు, మౌలాలి,చల్లా శివరాజు తదితరులు పాల్గొన్నారు.