`ది కశ్మీర్ ఫైల్స్` నిజాలు చెప్పండి.. శివసేన సూచన !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ కు శివసేన పార్టీ పలు కీలక సూచనలు చేసింది. బీజేపీని ఎదుర్కొనే వ్యూహాన్ని సిద్దం చేసుకోవాలని సూచించింది. కుహనా లౌకికవాదాన్ని వదిలిపెట్టాలని, బీజేపీని ఎదుర్కొనడానికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించాలని సలహా ఇచ్చింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాల ద్వారా, హిజాబ్ వివాదం ద్వారా బీజేపీ సృష్టించిన భావాలను తిప్పికొట్టేందుకు ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించాలని తెలిపింది. బీజేపీ సైబర్ ఆర్మీ బూటకపు కథనాలను సృష్టిస్తోందని ఆరోపించింది. ఇటువంటి కథనాలను బీజేపీ నేతలు బెంగాల్, మహారాష్ట్రలలో కూడా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కానీ అవి పని చేయడం లేదని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారని తెలిపింది. బీజేపీ మద్దతుగల వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలోనే కశ్మీరు నుంచి పండిట్లు వెళ్ళిపోయారని కాంగ్రెస్ చెప్పాలని తెలిపింది. బీజేపీకి సన్నిహితుడైన జగ్‌మోహన్ దాల్మియా అప్పట్లో జమ్మూ-కశ్మీరుకు గవర్నర్‌గా ఉండేవారని చెప్పాలని సలహా ఇచ్చింది.