ప్రజల ఆస్తులకు భద్రత లేని భూహక్కు చట్టాన్ని రద్దు చేయాల్సిందే
1 min readపత్తికొండలో న్యాయవాదుల బైక్ ర్యాలీ,రాస్తారోకో
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం 27/2023 ను తక్షణమే రద్దు చేయాల్సిందేనని పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ఎన్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండ పట్టణంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక జూనియర్ కాలేజీ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించరు.అనంతరం నాలుగు స్తంభాల దగ్గర న్యాయవాదులు రస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు భద్రత లేని భూహక్కు చట్టమును తక్షణమే రద్దు చేయాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చిన్న, సన్న కారు రైతులకు చాలా ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడతాయని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టైటిల్ డీడ్ సెటిల్మెంట్ జడ్జిమెంట్ స్థానిక సివిల్ కోర్టు పరిధి నుండి లేకుండా పోతుందన్నారు.కాబట్టి తక్షణమే ఈ చట్టాన్నిి రద్దు చేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటిిి చట్టం లేకపోగా మన రాష్ట్రం మాత్రమే నూతన భూ హక్కు చట్టాన్ని అమలు అమలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేయకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఈ యొక్క చట్టం అమలు చేస్తుందని, ఈ చట్టం అమలు చేయడంలో కేంంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అయిందని విమర్శించారు. నూతనంగా తీసుకువచ్చిన భూహక్కు చట్టం న్యాయవాదులకు మరియు చిన్న, సన్న కారు రైతులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని, కావున ఈ చట్టాన్ని ప్రభుత్వము తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి రంగస్వామి, ఉపాధ్యక్షులు దామోదరచారి, న్యాయవాదులు పంపాపతి, నాగేషు, మల్లికార్జున, బాలభాష రవి ప్రకాష్, సోమప్ప, నారాయణస్వామి, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధా కృష్ణ, వాసుదేవ, మధు, లక్ష్మన్న, హరి, రాజాక్, నాగరాజు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.