PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి

1 min read

ఐ. ఏ. ఎల్.  డిమాండ్

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రాష్ట్ర ప్రభుత్వం  నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. కృష్ణయ్య, బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఏ. మైరాముడు, భారత న్యాయవాదులు సంఘం ( ఐ. ఏ. ఎల్.) కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ లు  డిమాండ్ చేశారు.గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో స్థానిక  జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట  ఐ. ఏ. ఎల్. స్థానిక కమిటీ  ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఎన్. కృష్ణయ్య, ఏ. మైరాముడు, బి. సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజల ఆస్తులకు భద్రత లేని భూ హక్కుల చట్టం ను తెచ్చిందని అన్నారు.అధికార పార్టీ ఆదేశాల ప్రకారం నిర్ణయాలు చేసే రెవెన్యూ అధికారులు, ఇతర యంత్రాంగం ప్రజల ఆస్తులకు హక్కులను ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు.ఈ చట్టం పూర్తిగా అధికార పార్టీకి ,డబ్బున్న వారికి అనుకూలంగా ఉందని, పేద, మధ్యతరగతి వారికి అన్యాయం జరుగుతుందని వారు స్పష్టంచేశారు.రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఈ చట్టం ను రద్దు చేసేంత వరకు ఐ. ఏ. ఎల్. ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఎం. నారాయణ స్వామి, ప్రసాద్ బాబు, బాల బాషా, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వర్లు,హరికృష్ణ, రాజాక్, మధు, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

About Author