కరోన జయించామన్న అధినేత.. వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్లు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి రెండేళ్లు దాటిపోయినా ఉత్తరకొరియాలో ఎంతమంది కరోనా బారినపడ్డారో ఇప్పటికీ స్పష్టత లేదు. అక్కడి ప్రభుత్వం కరోనా కేసుల లెక్కలు ఏవీ బయటపెట్టలేదు. ప్రతిరోజూ అనారోగ్యం బారినపడ్డ వారి సంఖ్యను మాత్రమే వెల్లడించేది. వారు కరోనా బాధితులా కాదా అనే విషయంపై మౌనం దాల్చేది. అయితే భారీ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉత్తరకొరియా ప్రభుత్వానికి లేదనేది పరిశీలకుల మాట. ఇదిలాఉంటే.. జూలై 29 తరువాత ఉత్తరకొరియా ఈ వివరాలనూ ప్రకటించడం మానుకుంది. ఆ తరువాత కొద్ది రోజులకే ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన ప్రకటన చేశారు. కరోనాను జయించామంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా.. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాజాగా కిమ్.. మిలిటరీ వైద్యులను సన్మానించేందుకు రాజధాని ప్యాంగ్యాంగ్‌లోఓ భారీ సభను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సభకు హాజరైన మిలిటరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.