PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రచారంలో ఇరు పార్టీల నాయకులు పల్లెబాట

1 min read

– పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో నాయకులు
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాఅభ్యర్థికే ఓటేయండి -ఇరుపార్టీల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వారివి

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలో ఉన్న పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇటు వైసిపి అటు టిడిపి నాయకులు పల్లెబాట పట్టారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల 13వ తేదీన స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలో ఉన్న పట్టభద్రులు అందరూ కూడా 13న ఓటు వేయాల్సి ఉంది.అధికార పార్టీ వైసీపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలే మాఅభ్యర్థిని గెలిపిస్తాయనే ధీమాలో వారు ఉండగా టిడిపిలో మాత్రం ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అభివృద్ధి కుంటుపడిందని నిత్యావసర ధరలు పెట్రోలు డీజిల్ తదితర వస్తువులు పెరగడం వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని టిడిపి నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.అధికార పార్టీలో వారం కిందట ఒకరోజు మిడుతూరులో చిన్న మల్లారెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.తర్వాత జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ లోకేశ్వర రెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,రామ నాగేశ్వర రెడ్డి మండలంలో ప్రచారం చేయుటకు వీరు రంగంలోకి దిగారు.ఇప్పటికే వీరు మండలంలోని సగం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారు.అంతేకాదు ఈఎన్నికల ప్రచారంలో జడ్పిటిసి మరియు సొసైటీ చైర్మన్ వివిధ గ్రామాలలో ఉన్న పట్టభద్రుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఓటును అడుగుతున్నారు.2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఏకైక వ్యక్తి జడ్పిటిసి యుగంధర్ రెడ్డి అని చెప్పవచ్చు.ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ప్రచారానికి వీళ్లే కాకుండా టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే ఎన్నికల పరిశీలకులు బూరగడ్డ వేదవ్యాస్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.టిడిపి నాయకులు రమేష్ రెడ్డి,గుండం రమణారెడ్డి ఇప్పటికే ప్రచారంలో మండలాన్ని మొత్తం చుట్టేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలంలోని వివిధ గ్రామాలలో మా పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందనే లెక్కల్లో ఇరు పార్టీల నేతలు లెక్కల్లో నిమగ్నం అయ్యారు.వైసీపీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డి,టిడిపి అభ్యర్థిగా భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు.వీరిద్దరిలో మిడుతూరు మండలంలో ఎవరికి మెజారిటీ వస్తుందనే విషయంలో 16వ తేది వరకు వేచి చూడాల్సి ఉంది.

About Author