PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.బాబు జగ్జీవన్​ రామ్​ జీవితం.. స్ఫూర్తిదాయకం

1 min read
డా.బాబు జగ్జీవన్​ రామ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నారాలోకేష్​

డా.బాబు జగ్జీవన్​ రామ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నారాలోకేష్​

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్
పల్లెవెలుగువెబ్​, తిరుపతి: సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు డా.బాబు జగ్జీవన్​ రామ్​ అని, ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్. సోమవారం డా.బాబు జగ్జీవన్​ రామ్​ 114వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్​ రామ్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తోపాటు SC సెల్ రాష్ట అధ్యక్షులు MS. రాజు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన డా.బాబు జగ్జీవన్​రామ్​… స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ ఉప ప్రధానిగా ప్రజలకు నిరంతరం సేవల అందించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీడిపి అధికార ప్రతినిధి పట్టాభి, శాసన మండలి సభ్యులు BT. నాయుడు (కర్నూలు) , రాష్ట తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుగారు, రాష్ట కార్యదర్శులు K. నాగేంద్ర కుమార్, (కర్నూలు), పోతురాజు రవికుమార్, కర్నూలు పార్లమెంట్ SC సెల్ అధ్యక్షులు దరూరుజేమ్స్, టీడిపి సీనియర్ నాయకులు మాజీ తూడా ఛైర్మన్ నరసింహా యాదవ్, తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author