మానవ జీవన విధానానికి మార్గదర్శనం శ్రీరాముడి జీవితం…..
1 min readవీహెచ్పీ ఏపీ సంఘటనా మంత్రి శ్రీనివాసరెడ్డి…
పల్లెవెలుగు వెబ్: రామోవిగ్రహవాన్ ధర్మః ధర్మానికి రూపం వస్తే అది శ్రీరామునిలా ఉంటుందని ఈ కలియుగం లో మానవులకు జీవన విధానం తెలియజేసే మర్యాదా పురుషోత్తముడి చరిత్రే రామాయణమనీ వన్టవున్ పరిధిలోని శ్రీ రామాలయం ప్రఖంఢలోని జమ్మిచెట్టు వద్దగల శ్రీలలితా పీఠంలో జరిగిన రామోత్సవాలలో విశ్వహిందూపరిషత్ ఆంధ్రప్రదేశ్ సంఘటనా మంత్రి శ్రీనివాస రెడ్డి అన్నారు.ఇంకా మాట్లాడుతూ రామాయణం లో ఉన్న ప్రతి పాత్ర ఒక సందేశాన్ని ఇస్తుందనీ ఒక వ్యక్తి తల్లిదండ్రులు వద్ద,అన్నదమ్ముల వద్ద,భార్య వద్ద,ప్రజలపట్ల ఎలా ఉండాలో నేర్పిన వాడు శ్రీరాముడు అలాగే ఒక స్త్రీ ఎలా ఉండాలో నేర్పే పాత్ర సీతమ్మ తల్లి,సోదరులు గా ఎలా వ్యవహరించాలో నేర్పేపాత్ర లక్ష్మణ భరత శత్రుఘ్నులు తెలియజేస్తారనీ,భక్తుడు,దాసుడు ఎలా వ్యవహరించాలో తెలియజేసే పాత్ర ఆంజనేయ స్వామిదనీ కావునా రామాయంణంలో ప్రతిపాత్ర మనకు జీవనవిధానాన్ని నేర్పుతుందన్నారు అయోధ్య లో శ్రీరామజన్మభూమిలో 30 శాతం పనులు పూర్తయ్యాయనీ దాదాపు 1000 సం. స్థిరంగా ఉండేలా భవ్యరామమందిర నిర్మాణం రాబోయే 2023 సం.లో మహాసంప్రోక్షణ జరుగుతుందనీ తెలియజేశారు.శ్రీ లితాపీఠం వ్యవస్థాపకులు,ఆధ్యాత్మిక వేత్త, గురుస్వామి శ్రీ మేడాసుబ్రహ్మణ్యం( సుబ్బి స్వామి) మాట్లాడుతూ హిందువులలో సంఘటనను పెంచడం కోసం ఈ రామోత్సవాలు విశ్వహిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నారనీ ఈ రామోత్సవాలకు లలితాపీఠం వేదికవ్వడం ముదావహమన్నారు.పై కార్యక్రమంలో శ్రీ లలితా పీఠం భక్తబృందం,హిందూ బంధువులందరూ పాల్గొన్నారు.అంతకు ముందు ఉదయం 10:00 గం.లకు వినాయక ప్రఖంఢ లోని శ్రీ ఈశ్వరాంజనేయ స్వామి ఆలయం,బుధవారం పేట,లో జరిగిన శ్రీరామోత్సవ సభలో జిల్లా ఉపాధ్యక్షులు పార్వతమ్మగారు ప్రసంగించారు కార్యక్రమంలో దుర్గా వాహిని జిల్లా కన్వీనర్ రాధిక, జిల్లా స నగర సహకార్యదర్శి ఈపూరినాగరాజు నగర ధమదుర్గావాహిని సహా సంతోషానికి శ్రీమతి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.