అక్క చెల్లెమ్మల జీవితాలు.. వెలిగిపోవాలి..
1 min read– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు నింపడమే సీఎం జగన్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో మున్సిపాలిటీ మరియు రూరల్ మండలాలకు సంబందించిన వై ఎస్ ఆర్ చేయూత రెండవ విడత చెక్కులకు పంపిణీ చేశారు. వై ఎస్ ఆర్ చేయూత క్రింద మున్సిపాలిటీలోని 3670 మందికి రూ .6.88 కోట్ల మెగా చెక్కును, రూరల్ మండలంలోని 1271 మంది 238.31 లక్షల మెగా చెక్కును ఎం ఎల్ సి జకియా ఖానంతో కలసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లబ్దిదారులకు అందచేశారు. మెప్మా అధికారి నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల్లో ఆర్థిక సుస్థిరతను కల్పించడం తో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పాటు అందించే చర్యలును ప్రభుత్వం చేపట్టిందన్నారు. మహిళలు ఆర్థిక స్వాలంభన సాధన కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, ఎంపిడిఓ సురేష్ కుమార్, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ సత్య నారాయణ, వైఎస్ఆర్ సీపీ నాయకులు హాబీబుల్లా ఖాన్, సర్పంచ్ ల సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, బేపారి మహమ్మద్ ఖాన్, జిన్నా షరీఫ్, కౌన్సిలర్లు ఫయాజుర్ రెహమాన్, జాకీర్, ఫయాజ్ అహమ్మద్,కొలిమి హారూన్, గౌస్ ఖాన్, అల్తాఫ్, అన్నా సలీం, జానం రవీంద్ర యాదవ్, జయన్న నాయక్,భాస్కర్ , ఇర్షాద్, ఏ వి రమణ, విక్కీ దేవేంద్ర, గువ్వల బుజ్జిబాబు, ఖాదర్ వలీ ,జావీద్, అమీర్, కొత్తపల్లె ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.