వైభవంగా శ్రీ సుయతీంద్ర తీర్థుల మధ్యారాధన
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థుల సమరాధధనోత్సాల లో భాగంగా బుధవారం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో మధ్యరాధన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుయతీంద్ర తీర్థుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం చేశారు. అనంతరం స్వర్ణ రథంపై శ్రీ సుయతీంద్ర తీర్థుల చిత్ర పటాన్ని ఉంచి మంగళ హారతి ఇచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వనుల మద్య భాజభజంత్రీల మద్య మఠం ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. మత్తూరు మఠం శ్రీ భోదానంద సరస్వతి స్వామీజీ కూడా తన ఉనికితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీఠాధిపతులు మంత్రాక్చతలు ఇచ్చి ఆశీర్వదించారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజ ఎస్ గిరయచార్, ఏఏఓ మాదవశెట్టి, మేనేజర్ వెంకటేష్ జ్యోషి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి స్వామి, శ్రీపతి మఠం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
