పలు పార్టీల ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
1 min read– వైఎస్సార్సీపీ , జనాసేన, అమ్మ పార్టీల నుంచి ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పిసిసి అద్యక్షులు గిడుగు రుద్రరాజు మరియు జిల్లా అద్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : రాష్ట్ర కార్యాలయంలో ఏపీసీసీ అద్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు ,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ షేక్ మస్తాన్ వలీ గ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ జే లక్ష్మీ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ , జనసెన , అమ్మ పార్టీల నుంచి ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వారికి ఏపీసీసీ అద్యక్షులు శ్రీ గిడుగు రుద్రరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పిసిసి అద్యక్షులు మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే , బావి భారత కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ ఈ దేశం కోసం ప్రజలకోసం నేతృత్వంలో పనిచేయడానికి సిద్దం అని కాంగ్రెస్ పార్టీ చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు .నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జే లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటు నియజకవర్గం నుంచి చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ఈ దేశంలో రాష్ట్రంలో బీసీ యస్సి ఎస్టీ ప్రజలపై దాడులు , మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నయి దేశంలో మధ్యతరగతి కుటుంబాల పరిస్తితి చాలా దారుణంగా ఉంది అలాంటి పరిస్తులలో కాంగ్రెస్ పార్టీ వారికి ఎల్లపుడూ అండగా ఉంటది అని హామీ ఇవ్వడం జరిగింది ఈసారి కచ్చితంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన సమయం వచ్చిందని తెలియజేశారు పార్టీలోకి చేరిన వారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం
వైఎస్సార్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు
1) వి సురేంద్ర రెడ్డి మండ్లెం గ్రామం జూపాడుబంగ్లా మండలం 2) బి రాము మండ్లేం గ్రామం జూపాడుబంగ్లా మండలంజనసేనా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు 1) మనపటి శ్రీనివాస్ గౌడ్ , నందికొట్కూరు నియోజకవర్గం 2) రాజు , అజీజ్ నగర్ నందికొత్కుర్ నియోజకవర్గం 3 ) మధు , చిన్నటేకుర్ గ్రామం , పన్యాం నియోజకవర్గం అమ్మ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు 1) స్వర్ణ సప్రవీన , కొలిమిగుండ్ల మండలం బనగానపల్లి నియోజకవర్గం2) అడం బాబు , కొలిమిగుండ్ల మండలం బనగానపల్లి నియోజకవర్గంఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు , మరియు స్థానిక నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.