పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ప్రధాన రహదారి
1 min read– తీరనున్న పట్టణ ప్రజల ట్రాఫిక్ సమస్య.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణం లోని GM టాకీస్ ప్రధాన రహదారి నీ 3 కోట్ల 10 లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు కార్యక్రమం మరియు నూతన రోడ్డు నిర్మాణానికి వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం లోని ఆర్ అండ్ బి వసతి గృహం నుంచి GM టాకీస్ వరకు ప్రధాన రహదరిని 8కోట్లరూపాయలతో రోడ్డు వెడల్పు కార్యక్రమం తో పాటు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని అందులో భాగం గానే పోలీస్ స్టేషన్ సర్కిల్ నుంచి GM టాకీస్ వరకు రెండవ దశ పనులకు 3 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పారు.త్వరలోనే పట్టణ వాసుల ట్రాఫిక్ సమస్య పూర్తి స్థాయిలో నెరవేరబోతుంది అని చెప్పారు.బనగానపల్లె పట్టణ జనాభా కు తగ్గట్టు పట్టణం లో ప్రధాన రోడ్లు వెడల్పు కార్యక్రమానికి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహాయ సహకారాలతో చేపట్టడం జరుగుతుంది అని చెప్పారు.ఈ కార్యక్రమం లో ఆర్ అండ్ బి డివిజనల్ ఇంజినీర్ సునీల్ రెడ్డి,అసిస్టెంట్ ఇంజినీర్ హుస్సైని,సిద్దం రెడ్డి రాం మోహన్ రెడ్డి, జిల్లేళ్ళ శంకర్ రెడ్డి,అబ్దుల్ ఖైస్, యానకండ్ల రాం మోహన్ రెడ్డి, గౌండా కంబగిరి,తదితరులు పాల్గొన్నారు.