PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాంసాన్ని 3 గంట‌ల్లోపే వండాలి.. లేదంటే !

1 min read

Fresh raw chicken legs arrangement on kitchen cutting board with tomatoes

ప‌ల్లెవెలుగు వెబ్ : చికెన్, మ‌ట‌న్ తినేవారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉంది. దేశంలోని మాంసాహారుల్లో అధికంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నార‌ని ప‌లు అధ్యయ‌నాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ను, గొర్రెను,కోడిని కోసేట‌ప్పడు.. వండేట‌ప్పడు త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మాంసం లేదా చికెన్ కోసిన 3 గంట‌ల్లోపే వండాల‌ని నిపుణులు చెబుతున్నారు. అంత‌కు మించి బ‌హిరంగంగా నిల్వ ఉంచితే మాంసంలో బ్యాక్టీరియా పెరిగి కుళ్లిపోతుంద‌ని చెబుతున్నారు. అలా 3 గంట‌ల్లోపు వండ‌ని ప‌క్షంలో 0 నుంచి 4 డిగ్రీలో ఉష్ణోగ్రత‌లో మాంసాన్ని నిల్వ ఉంచాలి. 24 గంట‌ల త‌ర్వాత అయితే -20 డిగ్రీల ఉష్ణోగ్రత‌లో నిల్వ ఉంచాలి. కానీ దుకాణాల్లో పొద్దున్న కోసి.. ప‌గ‌లంతా వేలాడ‌దీసి అమ్ముతున్నారు. మ‌రికొంద‌రు రోడ్డు పక్కనే అమ్ముతున్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రజ‌ల ఆరోగ్యం దెబ్బతింటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

About Author