PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలనాటి జ్ఞాపకాలు ఎంతో “మధురం”

1 min read

వైభవంగా జూనియర్ కళాశాల పైలాన్, సావనీర్ పుస్తకావిష్కరణ

కార్యక్రమానికి తరలివచ్చిన పూర్వ విద్యార్థులు

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: అలనాటి జ్ఞాపకాలు ఎంతో మధురమైనవని, విద్యార్థి జీవితంలో చేసిన చిలిపి పనులు. చిరకాలం జ్ఞాపకాలని అవి మధురంగా నిలిచిపోతాయని పూర్వ విద్యార్థులు పారవశ్యం చెందారు. ఆదివారం కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పైలాన్, సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ వీరేశప్ప, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీనివాసులు, రిటైర్డ్ లెక్చరర్స్ వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు,  రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ శివయ్య,  రిటైర్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో మల్లికార్జున రావు, ముంబై విజిలెన్స్ ఎయిర్పోర్ట్  అసిస్టెంట్ కమిషనర్ సురేష్ కుమార్ హాజరై కళాశాలలో గడిపిన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.  ముందుగా పూర్వ మహిళా విద్యార్థినులచే జ్యోతి ప్రజ్వలన గావించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు అయినప్పుడు మొదటి గురువులు మరియు పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించడం సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక సరస్వతి దేవాలయం అని కొనియాడారు. కళాశాలలో చదివిన  పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, అవి మన భావితరాలకు ఉపయోగపడగలవని ఆకాంక్షించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మున్ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపడతామని అన్నారు. అనంతరం కళాశాలలో పైలాన్ మరియు సావనీర్ పుస్తకావిష్కరణ కు కృషిచేసిన  పూర్వ విద్యార్థుల సంఘం  సభ్యులను సన్మానించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాల అభివృద్ధికి మరియు కళాశాలలో చదువుకుని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తమ వంతు సహాయ, సహకారాలు అందజేస్తామని తెలిపారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కళాశాలలో ఏర్పాటుచేసిన పైలాన్  దగ్గర పూర్వ విద్యార్థులు బ్యాచ్ ల వైడ్ గా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా కొంత సమయాన్ని గడిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆర్గనైజర్స్ డాక్టర్ రామారావు, అడ్వకేట్ సురేష్, కళ్యాణ్, బ్యాంకు మేనేజర్ రామ్మోహన్,  సాయిబాబా, అరుణాచల రెడ్డి, రాజేష్, సురేంద్ర మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author