PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలి..

1 min read

– రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు గంజి మాల దేవి

 – పాఠశాల సమయంలో విద్యార్థులను చూడవలసిన పూర్తి బాధ్యత ప్రధానోపాధ్యాయులదే..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  పెదపాడు గ్రామం మధ్యాహ్న భోజన పధకంలో నిర్దేశించిన మెనూ ను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు గంజిమాల దేవి అధికారులను ఆదేశించారు.  పెదపాడు మండలం వట్లూరులోని జెడ్పి బాలికల ఉన్నత పాఠశాలను  బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ విద్యార్థినులకు  సరఫరా చేస్తున్న ఆహారాన్ని పరిశీలించి,  విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  అనంతరం దేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరుతో  విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది, రోజుకు ఒక మెనూ ని నిర్దేశించి ఆ ప్రకారమే భోజనం అందించాలని ఆదేశించిందన్నారు. మధ్యాహ్న భోజనంలో మరింత పోషక విలువలు పెంపొందించేందుకుగాను రాగిజావను కూడా అందిస్తున్నదన్నరు.  మధ్యాహ్న భోజనం పూర్తి స్థాయిలో రుచిగా, పౌష్టికాహారంతో ఉండేలా చూడాల్సిన బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులదేనన్నరు. అనంతరం  పాఠశాలలో బియ్యం, కందిపప్పు, ఇతర సరుకుల వివరాలను రిజిస్టర్ ప్రకారం తనిఖీ చేశారు. అనంతరం వట్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని, డా: బి.ఆర్. అంబేద్కర్ గురుకు పాఠశాలను, పి .హెచ్. సి.  ఆకస్మికంగా తనిఖీ చేశారు.  అంతకుముందు జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, ఏలూరు, పెదవేగి మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పరిశీలించారు.  కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణ రాజు, డీఈ ఓ శ్యాం సుందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  రామరాజు, తూనికలు కొలతల ఆఫీసర్ ప్రశాంత్ కుమార్, ఐ సి డి ఎస్ పీడీ పద్మావతి,  ప్రభృతులు పాల్గొన్నారు.

About Author