రాయలసీమకు మరో వానగండం
1 min read
పల్లెవెలుగు వెబ్: భారీ వర్షాలకు ఏపీలోని కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైయ్యాయి. తాజాగా మరో పిడుగులాంటి వార్త వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యూలేషన్ ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 4, 5 రోజులలో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 26, డిసెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోపక్క ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదలుతుండటంతో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.