క్రింది స్థాయి వర్కర్ పై సైకోల వ్యవహరించిన ఎంహెచ్ఓ
1 min read– పబ్లిక్ హెల్త్ విభాగంలో పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ పై మండిపడ్డ ఎంహెచ్ఓ..
– ఎంహెచ్ఓ వ్యవహార శైలి పై
– ఏ.ఐ.టి.యు.సి నాయకులు డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం..
– శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, కెలోమి కి న్యాయం చేయాలని నిరసన ధర్నా..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగంలో ట్రాక్టర్ క్లీనర్ గా పనిచేస్తున్న కే లోమి ఆగస్టు మాసంలో మూడు రోజులు ఆరోగ్యం బాగోక సిఎల్ పెడితే ఎం హెచ్ ఓ సి ఎల్ మంజూరు చేయకుండా ఆబ్సెంట్ వేసి జీతం రాకుండా చేయడాన్ని నిరసిస్తూ గురువారం నాడు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏఐటియుసి నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. క్రింది స్థాయి వర్కర్ పై సైకోల వ్యవహరించిన ఎంహెచ్ఓ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని, కె లోమీకి న్యాయం చేయాలని ఏఐటియుసి ఏలూరు జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు డిమాండ్ చేశారు.అనంతరం డిప్యూటీ కమిషనర్ రాధా కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏలూరు జిల్లా కన్వీనర్ బండి వెంకటేశ్వరరావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు మాట్లాడుతూ ఆగస్టు 15, 16, 17 మూడు రోజులు సెలవు కోసం ట్రాక్టర్ క్లీనరు కెలోమీ సంబంధిత ఏ ఈ తో మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ తో సీఎల్ దరఖాస్తు పై సంతకాలు పెట్టించి ఆగస్టు 14న ఎమ్.హెచ్. ఓ సంతకం కోసం కెలోమీ వెళితే సెలవు మంజూరు చేయకుండా సీఎల్ పేపర్ ను ముఖం మీద కొట్టి పంపించేసి ఆ మూడు రోజులు ఆబ్సెంట్ వేసి జీతం రాకుండా సైకోల ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఎమ్ హెచ్ ఓ పై చర్య తీసుకోమని కమిషనర్ కి ఫిర్యాదు చేసి 18 రోజులకు కావస్తున్న ఎటువంటి చర్యలు తీసుకొకపోవడంతో గురువారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టమని వారు తెలిపారు. ఇప్పటికైనా ఎంహెచ్ఓపై చర్య తీసుకుని కెలోమీ పెట్టుకున్న సి ఎల్ ను మంజూరు చేయాలని బండి వెంకటేశ్వరరావు ఏ అప్పలరాజు డిమాండ్ చేశారు. లోమీకి న్యాయం జరిగే వరకూ ఎంహెచ్ఓపై చర్య తీసుకునే వరకు ఏఐటియుసి న్యాయ పోరాటం చేయుటకు సిద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. ధర్నా కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బి నాగేశ్వరరావు యూనియన్ కోశాధికారి బి నారాయణరావు, నాయకులు పివి రమణ కే రామకృష్ణ, పెద్దిరాజు, ఎస్ కే ఆలీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.