పరారీలో కాదు.. ప్రజల మధ్యలో..!
1 min read– జయహో బీసీకి హాజరై టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి
- వైసీపీ సోషల్ మీడియాకు ఏప్రిల్ పూల్..
- మాండ్ర రాకతో కంగుతిన్న వైసీపీ నేతలు
నందికొట్కూరు, పల్లెవెలుగు: టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి పరారీలో ఉన్నాడు..టీడీపీ పనైపోయింది.. అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు పోస్టులు పెడుతూ సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నేతను అరెస్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు వస్తే తప్పించుకొని పారిపోయాడని ఎద్దేవాచేశారు. కానీ వీటి అన్నింటికీ చెక్ పెడుతూ వైసీపీ నాయకులను ఏప్రిల్ పూల్ చేస్తూ టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి మిడుతూరు మండలం తలముడిపి గ్రామంలో నిర్వహించిన టీడీపీ జయహో బీసీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది చూసిన వైసీపీ నాయకులకు దిమ్మదిరిగే షాక్ తగిలింది. వైసీపీ చేసిన తప్పుడు వదంతులకు చెంప చెల్లుమంది. మాండ్ర రాకతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
వైసీపీ వదంతులు.. :
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో హైడ్రామా సాగింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ భూ వివాదం కేసులో శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. నేరుగా శివానందరెడ్డి ఇంటికి వెళ్లిన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో మొదట నోటీసు ఇవ్వాలని శివానందరెడ్డి కోరారు. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ చూపాలంటూ కోరారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ చేస్తుండగా అక్కడ నుంచి శివానందరెడ్డి ఉడాయించారు. శివానందరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపిందని వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు వదంతులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు .
మాండ్ర వీడియోతో వదంతులకు పుల్ స్టాప్… :
న్యాయపరంగా సంబంధిత పత్రాలతో వస్తే సహకరించడానికి తాను ఎప్పుడు సిద్ధమే అని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి ఒక వీడియో మీడియాకు విడుదల చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ ఉదయం నుండి వివిధ సోకాల్డ్ చానల్లలో వస్తున్న అవాస్తవాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. సీసీఎస్ పోలీసులు రావడం వాస్తవం. కానీ వారు ఎలాంటి వారెంట్ కానీ, నోటీస్ కానీ ఇవ్వకుండా మీరు హైదరాబాదుకు రండి అక్కడ దీనికి సంబంధించిన నోటీస్ లు ఇస్తామని చెప్పారన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సామాన్య వ్యక్తిని సైతం నోటీస్ లేకుండా స్టేషన్లకు పిలిచే అధికారం లేదని పేర్కొన్నారు . సంబంధంలేని అక్యూస్డ్ గా , తన పేరు కూడా లేని కేసులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం విడ్డురమని అన్నారు. సంబంధిత పత్రాలు ఏమి లేకుండా కొంతమంది నాయకుల మాటలు నమ్మి ఇలాచేయడం సమంజశం కాదని అన్నారు. సంబంధిత పత్రాలతో వస్తే పోలీసు అధికారులకు అన్నివిధాల సహకరించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని నంద్యాల పార్లమెంటు టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. న్యాయవాదులు సైతం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితులలో అక్కడకు వచ్చిన అధికారులు లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. ఈ వీడియో తో వైసీపీ వదంతులకు పుల్ స్టాఫ్ పడింది.