కక్ష సాధింపులో భాగమే అర్ధరాత్రి అరెస్టు
1 min read– బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గద్దెల నాగభూషణం
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి ఆదేశాల మేరకు ఈ దినం అనగా తేదీ 11-09-2023, ఉదయం 11 గంటలకు అనంతపురం పట్టణంలోని స్థానిక కాన్షీరాం విగ్రహం వద్ద బీఎస్పీ పార్టీ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న బిఎస్పీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు గద్ధల నాగభూషణం, జిల్లా ఇంఛార్జి లు కాసాని నాగరాజు, లక్ష్మీ నారాయణ, అనంతపురం నియోజకవర్గం అధ్యక్షులు హరిప్రసాద్ మరియు సీనియర్ నాయకులు గవ్వల ఓబులేసు,ఈ సందర్భంగా బిఎస్పీ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత మరియు శాసనసభ్యులు అయిన నారా చంద్రబాబు నాయుడును అరెస్టు చేసేటప్పుడు, ముందుగా సమాచారం ఇవ్వకుండా, ఎటువంటి నోటీసు లు ఇవ్వకుండా, ఒక శానససభ్యున్ని అరెస్టు చేసే సమాచారాన్ని శాశన సభా అధ్యక్షులు స్పీకర్ కు గానీ, రాష్ట్ర గవర్నర్ కి గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం ఎఫ్.ఐ.ఆర్ లో పేరు చేర్చకుండా, ఎఫ్.ఐ.ఆర్ లో పేరు లేకున్నా, అప్రజాస్వామికంగా అర్ధరాత్రి అరెస్టు చేయడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నించిన పద్ధతి, తీరు కక్ష సాధింపు చర్యకు నిదర్శనంగా కనిపిస్తున్నదనీ, ప్రతిపక్ష నాయకుల యెడల, ప్రతిపక్ష పార్టీల యెడల ఈ ప్రభుత్వం యొక్క అణిచివేత ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఈ అరెస్టును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిందని భావించక తప్పదు, భారత రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య పరిపాలన విధానాలకు భిన్నంగా రాజకీయ పార్టీల పట్ల అవలంబిస్తున్న ధోరణి మంచిది కాదని బహుజన సమాజ్ పార్టీ భావిస్తున్నదని తెలిపారు. అంతేకాకుండా సిఐడి అధికారులు విలేకరులతో 570 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. కానీ కోర్టు కు సమర్పించిన నివేదికలో 270 కోట్లు అవినీతి అని తెలిపారు. సిఐడి అధికారులు మొదట నారా చంద్రబాబు నాయుడు ఏ1 ముద్దాయి అని తెలిపారు చివరకు ఏ37 ముద్దాయిగా చేర్చారు. ఇది ఏవిధంగా సబబు అని, ప్రజలు దీనిని ఏవిధంగా అర్థం చేసుకోవాలి ఏది నిజమో ఏది అపద్ధమో ఏది నమ్మాలని అనుమానం వ్యక్తం చేశారు.జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి తాను అక్రమ కేసుల్లో ఇరికించబడ్డానని, అదే విధంగా అందరినీ ఇరికించాలనే మనస్తత్వం మంచిది కాదని చెబుతూ, అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరిస్తున్న ప్రవర్తన తీరు గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరుతున్నాం, జగన్మోహన్ రెడ్డి , చంద్రబాబు నాయుడు ఇలా ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం శిక్షార్హులే కానీ ప్రభుత్వ సంస్థలను అధికార పార్టీ తమ జేబు సంస్థలుగా ఉపయోగించరాదని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడడాన్ని బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఎస్పీ పార్టీ నాయకులు గద్ధల నాగభూషణం అనంతపురం జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజు జిల్లా ఇంఛార్జి, కొత్తూరు లక్ష్మి నారాయణ జిల్లా ఇంఛార్జి, పి.ఎస్. హరిప్రసాద్ అనంతపురం నియోజకవర్గం అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు గవ్వల ఓబులేసు తదితరులు పాల్గొన్నారుపాల్గొన్నారు.