పల్లెవెలుగువెబ్ : అమ్మాయిల వివాహ వయసు పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లు ఉండగా.. 21 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సస్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా యువతుల వివాహ వయసు పెంచుతామని తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగంగానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే.