ఆశాలకు కనీస వేతనం 26 వేల రూ. ఇవ్వాలి
1 min read– ఆశలకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల : సిఐటియు జిల్లా నాయకులు వెన్న. బాల వెంకట్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమణకుమారి జిల్లా నాయకులు సోమన్న లు పీహెచ్సీలో జరిగిన ఆశ డే సందర్భంగ వారు ముఖ్య అతిథులు గా హాజరై మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, 10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం సెలవులు మెడికల్ లీవులు వేతనంతో కూడిన మేటర్నరీ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.62 సంవత్సరాల రిటైర్మెంట్ జీవోను ఆశా కార్యకర్తలకు వర్తింపజేయాలని , ఆశా కార్యకర్తలకు పర్మినెంట్ పోస్టులలో వెయిటేజ్ ఇవ్వాలి కోవిడ్ కాలంలో ఆశా కార్యకర్తలు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని ప్రభుత్వం కనీసం రక్షణ పరికరాలు కూడా ఇవ్వలేదన్నారు. పని భద్రత లేదని ప్రమాదం జరిగితే పట్టించుకునే నాధుడే లేడని అనారోగ్యం పాలైతే వైద్య సౌకర్యం లేదని రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ పెన్షన్స్ సౌకర్యం లేదని ఆశా కార్యకర్తలు నిత్యం అభద్రతతో పనిచేస్తున్నారని అన్నారు.వేతనాలు నెలకు ఒకసారి ఇవ్వడం లేదని వారంలో రోజుకు ఒక పని ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించి ఆశాలతో 24 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆశాలకు సంబంధం లేని పనులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం ఇచ్చిన నాసిరకం సెల్ ఫోన్స్ అసలు పని చేయడం లేదని అన్నారు. డ్యూటీలో ఉండి చనిపోయిన ఆశ కార్యకర్తలకు ఎక్స్గ్రేషియా లేదని, కనీసం మట్టి ఖర్చు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఏళ్ల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు సేవలు చేసిన ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు.పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తున్నాం అనే కారణం పేరుతో సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదని, ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం వెంటనే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాలలో ఆశ యూనియన్ నాయకురాలు భారతి సరస్వతి రమణమ్మ చెన్నమ్మ తో పాటు పీహెచ్సీలలో ఆశలు పాల్గొన్నారు.