PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడీలకి కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలి

1 min read

– ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని,రూ. 26 వేలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం నందికొట్కూరు ఐసీడీఎస్ కార్యాలయాం దగ్గర నిరాహారదీక్షలు చేపట్టారు.ఈ దీక్షకు ఏఐటీయూసీ కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షత వహించారు.ఈ దీక్షలను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురాం మూర్తి,రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబులు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి మహిళా కార్మిక హక్కులను కాల రాస్తున్నారని వారన్నారు . అషు తోస్ రిపోర్టు చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వారికి గ్రాట్యుటీ అమలుచేయాలని చెబుతున్న పెడచెవిన పడుతుందన్నారు.దేశ న్యాయస్థానం తీర్పులను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి వారికి కూడా రిటైర్మెంట్ వయసును 62సంవత్సరాలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. తన పాదయాత్రలో కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి వారితో వెట్టిచాకిరి చేయించుకొని కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. నెల నెలా అంగన్వాడీలకు ఏ ఒక్క బిల్లు కూడా పెండింగులో పెట్టకుండా చెల్లించాలని,అలా అయితేనే వారికి పౌష్టికాహారం అందిస్తారని లేకపోతే అప్పులు చేసి పెట్టేపరిస్థితి లేదన్నారు. అలా కాకుండా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్ వాడీలను తీసివేస్తామని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులకు గురి సహించేది లేదన్నారు.. ప్రతి బడ్జెట్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కు తగిన బడ్జెట్ ను కేటాయించి ఐసీడీఎస్ ను అభివృద్ధి బాటలో నడిపించాలను డిమాండ్ చేశారు. ఈ సమస్యలో తక్షణమే పరిష్కరించకపోతే రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నిరాహారదీక్ష కార్యక్రమం లో ఎపి అంగన్వాడీ వర్కర్స్ &హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు కమల, కాత్యాయనీ, నాగేశ్వరామ్మ, వనజ, వి రవణమ్మ, ఎన్ వి రమణమ్మ, శ్రీలక్మి, నరజహాన్, వెంకటలష్మి, సువర్ణ, రవణమ్మ, మహాదేవి, సరోజ,శైలజ, మని, ఉమా తదితరులు కూర్చుని పాల్గొన్నారు.

About Author